Oct 20,2023 23:18

ప్రజాశక్తి - తాళ్లరేవు, యు.కొత్తపల్లి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా ఏర్పడుతుందని ముమ్మడివరం ఎఎంసి. చైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ అన్నారు. శుక్రవారం పి.మల్లవరంలో సర్పంచ్‌ దున్నా సత్యనారాయణ అధ్యక్షతన హైస్కూల్లో జరిగిన సురక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికీ ఆరోగ్య రక్షణ కల్పించేందుకే ప్రబుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. గాడిమొగ, తాళ్లరేవు పిహెచ్‌సి వైద్యులు జయభార్గవి, ఈశ్వర్‌, సురేష్‌, కంటి వైద్యులు సత్తిబాబు, నిపుణులైన ఇతర వైద్యులతో సుమారు 350 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం 9 మందిని కాకినాడ రిఫర్‌ చేశారు. అనంతరం శివన్నారాయణ రోగులకు ఉచితంగా మందులు, గర్భిణులకు పౌష్టికాహార కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి ధూళిపూడి నాగేంద్రప్రసాద్‌, ఇఒపిఆర్‌డి ఎం.భైరవమూర్తి. పంచాయతీ కార్యదర్శి సూరంపూడి వెంకట రమణ, ఉప సర్పంచ్‌ పంపన రామకృష్ణ, నాయకులు దున్నా శ్రీకాంత్‌, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది కుమార్‌, ఆంజనేయులు, ఎఎన్‌ఎంలు, ఆశాలు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.
యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో నిర్వహించిన శిబిరంలో వైసిపి మండల కన్వీనర్‌ ఉమ్మిడి జాన్‌ మాట్లాడారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేదలుకు కార్పొరేట్‌ తరహా వైద్యం అందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ పి.వెంకటనారాయణ, కార్యదర్శి శ్రీనివాస్‌, మెడికల్‌ సిబ్బంది వాలంటీర్స్‌ పాల్గొన్నారు.