Oct 03,2023 22:29

గరుగుబిల్లి : వైద్యాధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి

ప్రజాశక్తి - బలిజిపేట : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గ్రామాల్లో వైద్య సేవలు అందించి ఆరోగ్యకర సమాజానికి కృషి చేస్తుందని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని వెంగాపురంలో మంగళవారం నిర్వహించిన జగనన్న సురక్ష వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో కలిసి సందర్శించారు. వైద్య శిబిరంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. క్రానికల్‌ డిసీజ్‌ కేసులు గుర్తించారా, ఎక్కువగా ఏఏ జబ్బులతో రోగులు శిబిరానికి వస్తున్నారని వైద్యులను ప్రశ్నించగా సీజనల్‌ వ్యాధులపై ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని కలెక్టర్‌కు తెలిపారు. వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన పలు విభాగాలను, మందుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ వాలంటీర్లు, ఎఎన్‌ఎంల ఆరోగ్య సర్వేతో పాటు గ్రామ సచివాలయ పరిధిలోని సిడి ఎన్సిడి సర్వే జాబితా వివరాలు ఆధారంగా రోగులను గుర్తించి ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకుండా మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న ఆసుపత్రులపై శిబిరానికి వచ్చే రోగులకు అవగాహన కల్పించాలని సూచించారు. శిబిరానికి వచ్చే వారికి అవసరమైన ఆరోగ్య చికిత్సలతో పాటు మనోధైర్యాన్ని నింపాలన్నారు. అనారోగ్యంతో అధిక డబ్బులు ఖర్చుపెట్టి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకూడదన్న ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గ్రామాల్లో నిర్వహిస్తుందని అన్నారు. అక్కడ ఉన్న వృద్ధురాలితో వైద్య సేవలు అందుతున్న ఆరా తీయగా గ్రామంలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తుండడంతో ఎవరి అవసరం లేకుండా వైద్య పరీక్షలు కోసం శిబిరానికి స్వయంగా వచ్చానని ఆమె బదులిచ్చారు. ఎంపిపి జి.నాగమణి, సర్పంచ్‌ జి.అమ్మడమ్మ, ఎంపిటిసి సభ్యులు జి.మురళి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ టి.జగన్మోహన్‌రావు, తహశీల్దార్‌ అప్పారావు, వైద్యులు డి.కిరణ్మయి, ఎల్‌. సందీప్‌, తదితరులు పాల్గొన్నారు.
భామిని : భామిని, బత్తిలి పి హెచ్‌ సి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మండలంలోని బొడ్డగూడ పంచాయతీలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారులు డాక్టర్‌ ఫణికుమార్‌, డాక్టర్‌ సోయల్‌, కొండపల్లి రవీంద్ర రోగులకు వైద్యపరీక్షలు చేశారు. ఇదిలా ఉండగా ఐటిడిఎ పిఒ కల్పన కుమారి హెల్త్‌, పోషకాలు కూడిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం అందిస్తున్న వైద్య సేవలు, మందులు పరిశీలించారు. కార్యక్రమంలో మలేరియా సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ అప్పారావు, ఎంపిపి ప్రతినిధి తోట సింహాచలం, జెసిఎస్‌ కో ఆర్డినేటర్‌ కొత్తకోట చంద్రశేఖర్‌, తహశీల్దార్‌ ఎన్‌.అప్పారావు, ఎంపిడిఒ జి.చంద్రరావు, మాణిగ సర్పంచ్‌ కొండగొర్రి చంటి, బొడ్డగూడ సర్పంచ్‌ అనంతరావు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని అంటిపేట సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు వైద్యశిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ బి.జగన్నాధరావు, జెడ్పీటీసీ మామిడి బాబ్జీ, ఎంపిపి ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, సీనియర్‌ నాయకులు పోల ఈశ్వర నారాయణ, మాజీ జెడ్పీటీసీ అంబటి కృష్ణంనాయుడు, స్థానిక సర్పంచ్‌ బొంగు తిరుపతి రావు, ఎంపీటీసీ ఎస్‌.నిర్మల, ఎంపిడిఒ, తహశీల్దార్‌, పలుశాఖల అధికారులు, వైద్యసిబ్బంది, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
వీరఘట్టం: మండలంలోని చలివేంద్రలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.జగన్నాధరావు జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని సందర్శించి వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపిపి డి.వెంకటరమణనాయుడు, మండల ప్రత్యేక అధికారి పి.కిరణ్‌కుమార్‌, తహశీల్దార్‌ సిహెచ్‌ సత్యనారాయణ, ఎంపిడిఒ జిజె ప్రసాద్‌, సర్పంచ్‌ ఎస్‌.సుదర్శనరావు, ఎంపిటిసి పోరెడ్డి వెంకటనాయుడు, సచివాలయ కార్యదర్శి శ్యాం, విఆర్‌ఒ రఘు, వైద్య, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: మండలంలోని గొట్టివలసలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి, వైసిపి జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు, ఎంపిపి ఉరిటి రామారావు, ఉమ్మడి జిల్లాలజిల్లాపరిషత్తు వైస్‌ చైర్మన్‌ మరిశర్ల బాపూజీనాయుడు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బగాది జగన్నాధరావు, జి.పైడితల్లితది తరులు పాల్గొన్నారు.
సాలూరు రూరల్‌ : మండలంలోని నెల్లిమర్ల, జీగిరాంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాక్రమం నిర్వహించారు. వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, వైసీపీ మండల అధ్యక్షులు సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ శిబిరంలో 650మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మామిడిపల్లి పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ కనకాల శ్రీకాంత్‌ తెలిపారు. కార్యక్రమంలో జీగిరాం సర్పంచ్‌ అల్లు సుభాషిణి, నెలిపర్తి సర్పంచ్‌ ప్రతినిధి వేణు, ఎంపిటిసి సభ్యులు సురాప్పల నాయుడు, వైద్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.