జగనన్న ఆరోగ్య సురక్షతో అందరికీ ఆరోగ్యం: మంత్రి
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : ముఖ్యమంత్రి వైఎస్‌జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వాలని జగనన్న ఆరోగ్య సురక్షను తీసుకువచ్చారని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక వ్యవహారాల , యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్‌కె రోజా పేర్కొన్నారు. పుత్తూరు మండలం కష్ణసముద్రంలో శుక్రవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇచ్చిన వాగ్దానాలు 99 శాతం నెరవేర్చామని, నాలుగేళ్లలో దాదాపు రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు రూపంలో అందరి అకౌంట్లో వేశామని తెలిపారు. అందరూ ఆరోగ్యంగా వుండాలనే సంకల్పంతో జగనన్న ఆరోగ్య సురక్షను ప్రవేశ పెట్టారన్నారు. దాని ప్రకారం ప్రతి మనిషికి టెస్ట్ చేస్తారని తెలిపారు. పేదలకు ఒక్క రోజుకు చికిత్స కోసం 250 రూపాయల చొప్పున ఐదు వేల రూపాయలు చెల్లిస్తు న్న ట్లు తెలిపా రు. పుత్తూరు రూరల్ మండ లం కష్ణ సముద్రం సచి వాలయంలో 816 మంది ని ఎంపిక చేయగా వారిలో దాదాపుగా 450 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీటితో పాటు కంటి వెలుగు పరీక్షలు నిర్వహించడంతో దాదాపు 56 మందికి కంటి అద్దాలు అందించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు ఎంపీపీ, మునివేల మ్మ, వైస్ ఎంపీపీలు, విమలమ్మ, మునస్వామి రెడ్డి, ఎంపీటీసీ లు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు వైద్య ఆరోగ్య డాక్టర్లు, మండల, సచివాలయం కన్వీనర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










