Sep 23,2023 00:07

ప్రజాశక్తి - కారంచేడు
జగనన్న ఆరోగ్య సురక్ష పథకంపై వాలంటీర్లతో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈఓఆర్డి ఆర్ రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామంలోని వాలంటీర్లందరూ ఇంటింటికి తిరిగి జగనన్న ఆరోగ్య సురక్ష పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ఆరోగ్య సురక్ష యాప్‌ని గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి యజమాని సెల్ ఫోన్‌లో డౌన్లోడ్ చేయాలని చెప్పారు. ఈనెల 27న గ్రామంలో మెడికల్‌ క్యాంపు జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకు ఈ మెడికల్ క్యాంపులో ఉచితంగా పరీక్షల నిర్వహించి అవసరమైన వైద్యం చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంజయ్య, మాధవి, రాజకుమార్ పాల్గొన్నారు.