Sep 12,2023 21:49

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌

జగనన్న ఆరోగ్య సురక్ష'పై అవగాహన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపిడిఒ, మెడికల్‌ ఆఫీసర్లు ఎంఇఒ ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, ఎఎన్‌ఎంలు ఎంఎల్‌పిహెచ్‌లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఐజాక్‌ ప్రవీణ్‌ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 30వ తేదీ నుండి ప్రారంభించబడుతుందని తెలిపారు. దానికి 15 రోజులు ముందుగా వలంటీర్ల ద్వారా మండలంలోని అన్ని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ పరిధిలోని సచివాలయ పరిధిలోని గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారన్నారు.
ఈ సందర్భంగా వలంటీర్లు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా అనే కార్యక్రమాల గురించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. తదుపరి ఎఎన్‌ఎంలు ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది రెండు టీములుగా ప్రతి ఇంటిని సందర్శించి ఆరోగ్య వివరాలు నమోదు చేస్తారన్నారు. అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. షెడ్యూల్లో పేర్కొనబడిన విధంగా తేదీల్లో ఆ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ పరిధిలో సచివాలయ పరిధిలో నిర్వహించే తేదీలను ముందుగా తెలియజేస్తారన్నారు. ఈ క్యాంపులకు ప్రత్యేక డాక్టర్‌ బృందం హాజరై అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తారని తెలిపారు. ఎవరైనా వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైన చికిత్స నిమిత్తం సంబంధిత హాస్పిటల్స్‌కు పంపిస్తామన్నారు. మండలంలో ఉన్న పది విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ పరిధిలో తెలియజేసిన షెడ్యూల్‌ ప్రకారం తేదీలలో క్యాంపులు నిర్వహిస్తారని తెలిపారు. కాబట్టి ప్రజలందరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా వలంటీర్లు ద్వారా ప్రతి ఇంటికి సమాచారం అందజేసి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. అదేవిధంగా క్యాంపు నిర్వహణ రోజు తగు ఏర్పాటు చేసి అసౌకర్యం లేకుండా చక్కగా నిర్వహించడానికి ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని అందరూ సచివాలయ సిబ్బంది వైద్య ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మెడికల్‌ ఆఫీసర్లు మాట్లాడుతూ ఎఎన్‌ఎంలు మెడికల్‌ సిబ్బంది గృహాలను సందర్శించినప్పుడు నిర్వహించాల్సిన టెస్టుల వివరాలు క్యాంపు రోజు వారు రావడానికి టోకెన్లు అందజేసి సహకరించాలన్నారు. అదేవిధంగా వారిని ప్రత్యేక వైద్యం దగ్గర హాజరు పరిచి వారు తగు ట్రీట్‌మెంట్‌ పొందే విధంగా సహకరించాలని తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్లు టిజే దేవానంద్‌, అనూష, ఎంఇఒ నజీర్‌ బాషా, ఇఒపిఆర్‌డి ఉషారాణి, ఐసిడిఎస్‌ సూపర్వైజర్లు కేశవ నారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.