ఫొటో : మాట్లాడుతున్న డాక్టర్ వరలక్ష్మి
'జగనన్న ఆరోగ్య సురక్ష'పై అవగాహన
ప్రజాశక్తి-అనంతసాగరం : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జగనన్న ఆరోగ్య సురక్ష పథకంపై డాక్టర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో ఎఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పి, ఆరోగ్య సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 15వ తేదీ నుండి వలంటీర్, ఎఎన్‌ఎంలు సచివాలయ పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఆరోగ్యశ్రీ పథకం గూర్చి వారికి వివరించి అక్కడే అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి మెడికల్ క్యాంపు జరిగే తేదీని వారికి తెలిపి వారిని ఆరోజు సచివాలయ పరిధిలో డాక్టర్లు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్థారన్నారు.










