
ప్రజాశక్తి - భీమవరం రూరల్
హొహొ హొప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. స్థానిక పురపాలక సంఘం పరిధిలో బలుసుమూడి బిసి కాలనీలో జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటా సర్వేలో కలెక్టర్ పాల్గొని ప్రజలతో మాట్లాడారు. రోగ నిర్ధారణ ఆధారంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో వైద్య సూచనలు, వైద్య సేవలు పొందాలని ప్రజలకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ప్రతి గడపకు ఆరోగ్య సేవలు ఆదించడానికి రాష్ట్ర ప్రభుత్వ శ్రీకారం చుట్టుందన్నారు. ఇంటింటికీ ఆరోగ్య సిబ్బంది వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారని, అక్కడే కావాల్సిన పరీక్షలు చేస్తారని చెప్పారు. అనంతరం ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు పెట్టి అవసరమైన వారికి కళ్లజోళ్లు, వినికిడి యంత్రాలు, తదితర పనిముట్లను, మందులు అందిస్తారన్నారు. ఎఎన్‌ఎం, ఆశా వర్కర్, వాలంటీర్ ముగ్గురు కలిసి ప్రతి ఇంటికి వస్తారని, ఇంట్లోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు.హొ