Sep 30,2023 21:43

ప్రజాశక్తి - తణుకు రూరల్‌
        జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు అన్నారు. ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాల ప్రాంగణంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తణుకు, కాకిలేరు, దువ్వ, అత్తిలిలో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్‌ క్యాంపులను సం దర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి వంకా రవీం ద్రనా ధ్‌, శెట్టిబలిజ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తమ్మయ్య పాల్గొన్నారు.
       ఉండి : చిలుకూరులో శనివారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్‌, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహరాజు మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని సిఎం జగన్‌ రూపొందించారన్నారు.
        ఆచంట : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేడపాటి షర్మిలారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. అనంతరం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంపూర్ణ పౌష్టికాహారాన్ని పరిశీలించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆచంట రామేశ్వరస్వామి కళ్యాణ మండపంలో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంపూర్ణ పోషణ ఆహార పదార్థాలను డిప్యూటీ డిఎంహెచ్‌ఒ వరప్రసాద్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
       పెనుమంట్ర నెగ్గిపూడిలో ఆర్‌అండ్‌బి అతిథి భవనంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచి మామిడిశెట్టి ధనలక్ష్మి, రాజమండ్రి రుడా ఛైర్మన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, ఎంపిపి కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసురెడ్డి), జెడ్‌పిటిసి సభ్యులు కర్రి గౌరీ సుభాషిణి పాల్గొన్నారు.
మొగల్తూరు :మండలంలోని రామన్నపాలెంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు ప్రారంభించారు. అంగనవాడీ సిబ్బంది ప్రదర్శి ంచిన పౌష్టికాహారాన్ని, ఆహార శిబిరాన్ని పరిశీలించారు.
వీరవాసరం : మండలంలోని ఉత్తరరపాలెంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని భీమవరం ఎఎంసి ఛైర్మన్‌ కోటిపల్లి బాబు ప్రారంభించారు. వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి మందులు, కళ్ళజోళ్లు ఉచితంగా అందించారు.
     పాలకోడేరు : గొరగనముడి సచివాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సర్పంచి శివాజీరాజు, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మహేశ్వరరావు, ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటి రాజు), సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొల్ల శ్రీనివాస్‌, భూపతిరాజు వంశీకృష్ణంరాజు సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచి శివాజీరాజు వారికి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. జగ నన్న ఆరోగ్య సురక్ష నిర్వహణకు అద్భుతమైన సౌక ర్యాలు కల్పించిన సర్పంచి శివాజీ రాజును ఘనంగా సత్కరించారు.
పాలకొల్లు రూరల్‌ : మండలంలోని ఆగర్రులో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి సభ్యులు మేకా శేషుబాబు, జెడ్‌పిటిసి సభ్యులు నడపన గోవిందరాజు నాయుడు, ఎంపిపి చిట్టురి కనకలక్ష్మి, మండల కన్వీనర్‌ మైకేల్‌రాజు, గ్రామ సర్పంచి సాక గంగారత్నం పాల్గొన్నారు.
భీమవరం రూరల్‌ : మండలంలోని తాడేరులో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ ప్రారంభించారు.
ఆకివీడు : మండలంలోని చిన కాపవరంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డిసిసి అధ్యక్షులు నరసింహరాజు ప్రారంభించారు. అనంతరం స్థానిక నగర పంచాయతీ పరిధిలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యుల సహకారంతో హెల్త్‌ సెంటర్‌ వద్ద వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
పోడూరు : మండలంలోని పోడూరు పిహెచ్‌సి వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు.
నరసాపురం టౌన్‌ : చిట్టవరం సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ అధికారి, నరసాపురం ఇన్‌ఛార్జి ఆర్‌డిఒ కె.కృష్ణవేణి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
పాలకొల్లులో గందరగోళం
పాలకొల్లు :పాలకొల్లు డిఎన్‌ఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో ఎనిమిది సచివాలయాల పరిధిలో రోగులు శిబిరం వద్దకు వచ్చారు. శిబిరంలో స్పెషలిస్ట్‌ వైద్యులు కాకుండా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఇరువురు వైద్యులు, అర్బన్‌, ప్రాథమిక హెల్త్‌ సెంటర్లకు చెందిన నలుగురు వైద్యులు మాత్రమే హాజరయ్యారు. శిబిరం ఇండోర్‌ క్రీడా మైదానంలో పెట్టడంతో రీ- సౌండ్‌లో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది.