Sep 29,2023 23:47

జగనన్న ఆరోగ్య సురక్షలో ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు

జగనన్న ఆరోగ్య సురక్షలో ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు
ప్రజాశక్తి -సోమల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటిం టి సర్వే కార్య క్రమం లో భాగంగా సదుం మండలం ఎర్రా తి వారి పల్లె గ్రామంలో తంబళ్లపల్లె శాసన సభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ద్వారకనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వాలంటీర్లు వెళ్లి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలను ఆన్లైన్‌ చేసి పూర్తిస్థాయిలో ఆరోగ్య సమాచారాన్ని పొందుపరు స్తామని ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం సూచించిన పలు రకాల వైద్య పరీక్షలను నిర్వహించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్య కర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు.