
ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండలంలోని తూటంగి పంచాయితీ గేదెలబందలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్యశిబిరం నిర్వహించారు. 390 మందికి వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జడ్పిటిసి బి.ఈశ్వరి, సిహెచ్ జానకమ్మ మాట్లాడుతూ, జగనన్న సురక్షతో గిరిజనులకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ప్రత్యేక వైద్య నిపుణులు గ్రామాల్లో వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగ పరచుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పి.లలిత, ప్రత్యేక వైద్య నిపుణులు ఎన్ విజరుకుమార్, వైద్య అధికారులు ప్రేమ, హెల్త్ అసిస్టెంట్లు ఎస్.ప్రభాకర్, సంజీవ్ ఎస్.స్వామి, పంచాయతీ కార్యదర్శి ఆర్.రాజ్ కుమార్, ఎం.ఎల్ హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.