ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్ నిర్వహించారు. 594 మంది వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి రమేష్ బాబు, డిఎం అండ్ జమల్ భాష, సర్పంచ్ వి.వెంకట్రావు, వైస్ ఎంపీపీ ఆనంద్, వైసిపి మండల నాయకులు వి సింహాచలం, కృష్ణారావు, మండల వైద్య అధికారులు కె,కరుణ, ప్రేమ పాల్గొన్నారు.
పెదబయలు రూరల్:అరడకోట గ్రామ సచివాలయ పరిధి గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా 522 మందికి వైద్య పరీక్షలు చేశారు. 89 మందిని వివిధ ఆసుపత్రులకు రిఫరల్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ పూర్ణయ్య, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ కృష్ణారావు, స్థానిక వైద్యాధికారి సింధూరం పడాల్, నిఖిల్ గోమంగి సర్పంచ్‌లు మత్యలింగం, కాసులమ్మ పాల్గొన్నారు.
రంపచోడవరం:జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి శనివారం ప్రారంభించారు. ఆరోగ్య సురక్షలో భాగంగా అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే పరిశీలించారు. ఆరోగ్య పరీక్షలు, మందుల పరిస్థితిపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఏడిఎంహెచ్‌ఓ జి.ప్రకాశం, తహశీల్దారు పివివి జయకుమార్, ఎంపిడిఒ హరికృష్ణ, వైద్యులు పాల్గొన్నారు.










