వైద్య పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
ప్రజాశక్తి-ఆదోనిరూరల్
గ్రామాల్లో 'జగనన్న ఆరోగ్య సురక్ష' టోకెన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎఎన్‌ఎంలు పుష్పవతి, లక్ష్మీ, ఎంఎల్‌హెచ్‌పి కృష్ణవేణి తెలిపారు. శనివారం మండలంలోని పెద్దహరివాణం గ్రామంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష'లో భాగంగా వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వేతో పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈనెల 27న 'జగనన్న ఆరోగ్య సురక్ష'లో భాగంగా క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంపునకు వైద్యుల బృందం హాజరవుతారని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్య సేవలు అందజేయడం 'జగనన్న ఆరోగ్య సురక్ష' ధ్యేయమని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.










