
ప్రజాశక్తి-నెల్లూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జిల్లాలో విజయవంతమైనట్లు జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 30 తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 8వ తేదీ వరకు జరిగిన జిల్లా వ్యాప్తంగా అర్బన్ పరిధిలో 166, రూరల్ పరిధిలో 497 మొత్తం 663 ఆరోగ్య సురక్ష శిబిరాలను నిర్వహించి, 2,44,866 మంది ప్రజలు వైద్య సేవలు పొందారని కలెక్టర్ చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 59362 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా 6722 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారన్నారు.91,974 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా, 14586 మందికి బీపీ, 9384 మందికి మధుమేహం ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించినట్లు చెప్పారు. 4920 మందికి చిన్నచిన్న శస్త్ర చికిత్సలు, మెరుగైన వైద్య సేవలు అవసరమని గుర్తించి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు వైద్యులు సిఫారసు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల లో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు, ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులతో పాటు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల నుంచి కూడా ఒక స్పెషలిస్టు వైద్యుడు హాజరై ప్రజలకు వైద్య సేవలు అందించారాన్నారు. ఒక్కొక్క శిబిరానికి సరాసరిన న 400పైగా ప్రజలు హాజరై వైద్యసేవలు పొందినట్లు కలెక్టర్ పేర్కొన్నారు .వైద్యం అవసరమైన ప్రతి పేదవాడి ని చేయి పట్టుకుని నడిపించి సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే గొప్ప లక్ష్యం తో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాతమకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్య క్రమం నిర్వ హిస్తున్నదన్నారు.జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు విజయ వంతం గా నిర్వహించి నందుకు స్పెసిలిస్ట్ డాక్టర్లకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు,సిబ్బందికి,మండల గ్రామ స్థాయి అధికారులకు, ప్రజా ప్రతినిదులకు ధన్యవాదాలు తెలిపారు.