Sep 27,2023 20:17

సర్వే వివరాలను అడిగితెలుసుకుంటున్న ఎంపిడిఒ

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని అమకాం గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేను ఎంపిడిఒ డిడి స్వరూపరాణి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ముందుగా సచివాలయాన్ని సందర్శించి కార్యదర్శిని, సిబ్బంది పని తీరును అడిగి తెలుసు కున్నారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరై ప్రజల కోసం సేవలందించాలన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సర్వేను పరిశీలించారు. మండలంలో ఈ సర్వే మందకోడిగా సాగుతుందని వాలంటీర్లు అందరూ విధిగా పాల్గొని సర్వే పూర్తి చేయాలని కోరారు. సర్వేలో పాల్గొనని వాలంటీర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రామ్‌ను కూడా ఆమె సందర్శించారు. ఈ వైద్య శిబిరంలో 50 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు. అనంతరం బెల్లాంలో అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు.
వేపాడ: మండలంలోని సింగరాయలో బుధవారం సర్పంచ్‌ ఎన్‌ వెంకట్రావు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ అక్టోబర్‌ 17వ తేదీన గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేస్తారని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సచివాలయ, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.