Oct 27,2023 18:24

ప్రజాశక్తి - నూజివీడు రూరల్‌
   జగనన్న ఆరోగ్య సురక్ష పథకం చారిత్రాత్మకమైందని నూజివీడు ఎంపిపి ఆరేపల్లి శిరీష కొనియాడారు. శుక్రవారం మండలంలోని కొత్తూరు తండాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేద ప్రజలందరూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఆరోగ్యంగా ఉండటమే లక్ష్యంగా ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.