ప్రజాశక్తి -పొదలకూరు :ఐశ్వర్యం కన్నా ఆరోగ్యం ప్రధానమైందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని దుగ్గుంట రాజుపాలెంలోని ఎంపిపి ఎస్ స్కూల్ ఆవరణంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ క్యాంప్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, స్పాట్ రిజిస్ట్రేషన్, కేస్ షీట్ కౌంటర్, ల్యాబ్ టెస్టింగ్ కౌంటర్, మందుల పంపిణీ కౌంటర్ లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచన చేస్తారే తప్ప ఆరోగ్యం గురించి పట్టించుకోరన్నారు. రాష్ట్ర చరిత్రలో పేదల ఆరోగ్యం గురించి పట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని పేర్కొన్నారు. కలెక్టర్ ఎం హరి నారాయణన్ మాట్లాడుతూ గతంలో గ్రామాల్లోకి 104 వస్తేనే రోగాలను చూపించుకునే వాళ్ళని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాక ,తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉన్న అందరినీ టెస్ట్ చేస్తూ వారికున్న రోగాలను గుర్తిస్తున్నారని తెలిపారు మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.










