ప్రజాశక్తి - బాపట్ల రూరల్
ప్రతీ ఒక్కరి ఆరోగ్యం గురించి వాకబు చేసి, ముందస్తుగా ఆరోగ్య సమస్యలను గుర్తించి పరిష్కరించడానికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఎంఎల్‌ఎ కొన రఘుపతి అన్నారు. పట్టణంలోని ఒకటవ వార్డులో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి ఇంటిలోకీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ప్రభుత్వ సిబ్బంది వాకబు చేస్తారన్నారు. తర్వాత వైద్య శిబిరాల్లో పరీక్షలు చేసి అవసరమైన వారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తారన్నారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ప్రారంభ దశలోనే వైద్యం చేయించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖా అధికారి విజయమ్మ, మునిసిపల్ కమిషనర్ భాను ప్రతాప్ పాల్గొన్నారు.










