Oct 06,2023 22:04

ప్రజాశక్తి - కాళ్ల
           ప్రజలందరికీ ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకురావడం మంచి పరిణామమని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. మండలంలోని పెదఅమిరం సచివాలయం-1, మండల ప్రజా పరిషత్‌ స్కూల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచి డొక్కు సోమేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి ఉమామహేశ్వరరావు, కాళ్ల మండల వైద్యాధికారి డాక్టర్‌ ఎం.గులాబ్‌రాజ్‌కుమార్‌, డాక్టర్‌ ఎస్‌.సునీల్‌, ఎంపిపి శిరీష విశ్వనాథరాజు, జెడ్‌పిటిసి సభ్యులు సోమేశ్వరరావు, ఎంపిడిఒ జి.స్వాతి, కోపల్లె సొసైటీ అధ్యక్షుడు వేగేశ్న జయరామకృష్ణంరాజు పాల్గొన్నారు.
భీమవరం అర్బన్‌ :జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతంగా జీవించాలని ప్రభుత్వ విప్‌, ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. పట్టణంలోని సిహెచ్‌బిఆర్‌ఎం స్కూల్లో శుక్రవారం ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రజల ఆరోగ్య భద్రతలకు రూ.వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రజలు వైద్యపరంగా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. సిఎం జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ కోటిపల్లి బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.శ్యామల, రాష్ట్ర గౌడ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కామన నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్‌ తోట భోగయ్య, జెసిఎస్‌ కన్వీనర్లు గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు, చెల్లబోయిన సూర్యప్రకాష్‌, కోమటి రాంబాబు, కోడె యుగంధర్‌, ముత్యాల బుజ్జి, బొర్రా వాసు, పిప్పల నాని, కొప్పర్తి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆచంట : గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు పేద ప్రజలకు వరం లాంటిదని రాజమండ్రి రుడా ఛైర్మన్‌, ఆచంట నియోజకవర్గ పరిశీలకురాలు మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. కొడమంచిలి రైతు సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఎంతోమందికి లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ చిల్లే లావణ్య, ఎఎంసి మాజీ ఛైర్మన్‌ సుంకర ఇందిరా సీతారామ్‌, ఆచంట మండల సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్షులు సుంకర సీతారామ్‌, ఎంపిటిసి సభ్యులు యల్లమెల్లి బేబీ రాజేష్‌, ఎ.వేమవరం సర్పంచి జక్కంశెట్టి చంటి, వైసిపి నేతలు గణేషుల సుబ్బారావు, బొంతు శ్రీను, పుచ్చకాయల నాగార్జున, మన్నె సుబ్బారావు, బొక్కా మల్లేశ్వరరావు, కొండేటి లక్ష్మి పాల్గొన్నారు.
పాలకోడేరు :ప్రజా ప్రభుత్వం వైసిపి అని సర్పంచుల ఛాంబర్‌ మండల ప్రధాన కార్యదర్శి, విస్సాకోడేరు సర్పంచి బి.శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని విస్సాకోడేరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సర్పంచి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ, అంగన్‌వాడీలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన సభకు ఎంపిడిఒ మురళీగంగాధరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సర్పంచి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేయడంతో పాటు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ముఖ్యంగా ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అనంతరం సొసైటీ ఛైర్మన్‌ గడ్డం జోషి, కో-ఆప్షన్‌ సభ్యులు డాక్టర్‌ స్వర్ణలత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటి రాజు), మాజీ సర్పంచి పెనుమత్స శ్రీనివాసరాజు, పాపారావు, దుండి అశోక్‌బాబు, వైసిపి ముఖ్య నేతలు పిన్నమరాజు పధ్విరాజు, సహదేవరాజు, కోళ్ల ఫారం శ్రీనివాస్‌రాజు, ఉప సర్పంంచి కందుల నాగరాజు, ఎంపిటిసి సభ్యులు బొల్లం గాంధీ, పేదపూడి లక్ష్మీపతి, ఉప ఎంపిపిలు ఆదాడ లక్ష్మీతులసి, నరేష్‌, సర్పంచులు జంగం సూరిబాబు, ఇంజేటి మరియమ్మ, కడలి విజయలక్ష్మి, సొసైటీ మాజీ ఛైర్మన్‌ సమంతకుడి మారాజు (బాబు), బొక్క రాంబాబు, రిచి జాన్‌ కిడ్స్‌, పంచాయతీ కార్యదర్శి జార్జ్‌ ప్రసాద్‌, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఉండి : ప్రతి ఒక్కరికి కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని డిసిసిబి ఛైర్మన్‌, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌. నరసింహరాజు అన్నారు. మండలంలోని మహదేవపట్నం రెండో గ్రామ సచివాలయ పరిధిలో శుక్రవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతిఒక్కరూ జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను సందర్శించి మెరుగైన వైద్య సదుపాయాలను పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచి ముదునూరి సుబ్బరాజు, ఎఎంసి ఛైర్మన్‌ బొక్కా వెంకటేశ్వర్లు, వైసిపి మండల అధ్యక్షులు పెన్మెత్స అంజనేయరాజు, నాయకులు సాగిరాజు హరివర్మ, బాలం తులసి, గంటా కృష్ణ, బులుసు వెంకట రామకృష్ణ, గుండు నాగేశ్వరరావు, ఎంపిడిఒ అడబాల వెంకట అప్పారావు, యండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.
గణపవరం : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేదవాడికి మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత సిఎం జగన్‌కు దక్కుతుందని ఎంఎల్‌ఎ పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) అన్నారు. మండలంలోని సరిపల్లి సచివాలయం వద్ద శుక్రవారం ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి చనుమూరి లక్ష్మీభవానిశివప్రసాద్‌ అధ్యక్షత వహించారు. శిబిరంలో బిపి, షుగర్‌, దీర్ఘకాలిక వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ జి.జ్యోతిర్మయి, ఇఒపిఆర్‌డి పివి.సత్యనారాయణ, పిహెచ్‌సి డాక్టర్‌ పి.సంతోష్‌నాయుడు, డాక్టర్‌ చైతన్యకిరణ్‌, తాడేపలి ్లగూడెం చిన్నపిల్లల వైద్య నిపుణులు దివ్యరెడ్డి, తహశీల్దార్‌ పి.లక్ష్మి, సిహెచ్‌ఒ జాలాది విల్సన్‌బాబు పాల్గొన్నారు.
పాలకొల్లు రూరల్‌ : మండలంలోని చింతపల్లిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్ర మంలో వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావే శానికి గ్రామ సర్పంచి గుమ్మాపు పెద్దిరాజు అధ్యక్షత వహిం చారు. ఎంపిపి చిట్టూరి కనకలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో ఎంపిడిఒ సంఘాని వెంకటేశ్వరరావు, టిటిడి సభ్యు లు మేకా శేషుబాబు, తాతాజీ, మైకేల్‌రాజు పాల్గొన్నారు.
పెనుగొండ : మండలంలోని సిద్ధాంతం హైస్కూలులో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాజమండ్రి రుడా ఛైర్మన్‌ మేడపాటి షర్మిలారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి చింతపల్లి గనిరాజు (చంటి), ఎంపిటిసి సభ్యులు చిన్నం ఏడుకొండలు, గుత్తుల సత్యవతి, దామోదరం, పలివెల శ్రీను, కంకిపాటి డేవిడ్‌ పాల్గొన్నారు.
పోడూరు : మండలంలోని జగన్నాథపురంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నానరు. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచి గుడాల శిరీష చంటి, తహశీల్దార్‌ ఆర్‌వి.కృష్ణారావు, ఎంపిడిఒ డి.సుహాసిని, జెడ్‌పిటిసి సభ్యులు గుంటూరి పెద్దిరాజు, ఎంపిపి సుమంగళి సాగర్‌, డాక్టర్‌ మనిత్యాగి, డాక్టర్‌ సుప్రజ, డాక్టర్‌ నరేష్‌కుమార్‌, డాక్టర్‌ శ్రీ వాసవి, డాక్టర్‌ మహాలక్ష్మి, డాక్టర్‌ మహిధర్‌ పాల్గొన్నారు.