మాట్లాడుతున్న రాజగోపాల్‌రెడ్డి
జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరం
ప్రజాశక్తి-ఉదయగిరి:జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేద ప్రజలకు వరం లాంటిదని ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని శకునాలపల్లి సచివాలయ పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కల్లూరి వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన ప్రారంభ మైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యఆరోగ్య సిబ్బంది. వలంటీర్లచే ఇంటింటా సర్వే నిర్వహించి ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని గుర్తించి ఈ శిబిరంలో నిపుణులైన వైద్యులచే వైద్యసేవలు అందించడంతోపాటు ఉచితంగా మందులు అందజేయడం. అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా ప్రజారోగ్యాన్ని దష్టిలో ఉంచుకొని సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని అమలు చేశారన్నారు. ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం జగన్ ను మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తొలుత వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం శిబిరంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. డ్వామా పీడీ వెంకట్రావు శిబిరాన్ని సందర్శించి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ జీ.ఓబులరెడ్డి, సర్పంచులు కల్లూరి వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ గౌస్ మొహిద్దీన్, ఎంపీటీసీ కాకు విజయమ్మ, ఎంపీడీఓ ఈశ్వరమ్మ, వైద్యాధికారిణి శివకల్పన, డీటీ పజిహ ఈఓ పిఆర్‌డి మల్లికార్జున, మండల జెసిఎస్ అధ్యక్షులు కష్ణారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.










