ప్రజాశక్తి - సాలూరు : జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్) పేదలకు రక్ష అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగనన్న ఆరోగ్య సురక్ష పేదలపాలిట వరమన్నారు. అందులో ఇప్పటికే ఇంటింటి సర్వేలో భాగంగా ఏడు పరీక్షలు నిర్వహించారని చెప్పారు. నవంబరు 10 వరకు జిల్లాలో 287 వైద్య శిబిరాలు జిల్లాలో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపకల్పన చేశారని, ఇందులో ఐదు శిబిరాలు పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 84 మంది స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొంటున్నారన్నారు. కావున ఈ వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనికోరారు.
మండల స్థాయి తనిఖీ అధికారులు వీరే
ఈ పథకం మండల స్థాయి తనిఖీ అధికారులుగా జిల్లా అధికారులను నియమించినట్టు రాజన్నదొర తెలిపారు. పాచిపెంట - ఆర్.శివప్రసాద్ (డిఎస్‌ఒ), బలిజిపేట -కె.రాబర్ట్ పాల్, (జిల్లా వ్యవసాయ అధికారి), గరుగుబిల్లి ఒ.ప్రభాకరరావు (జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీరింగ్ అధికారి), మక్కువ-కె.విజయ గౌరి (ఐసిడిఎస్ పిడి), పార్వతీపురం - మల్లికార్జున (జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి), కొమరాడ - కెవిఎస్‌ఎన్ రెడ్డి (జిల్లా ఉద్యాన అధికారి), సీతానగరం - కె. రామచంద్రరావు (డ్వామా పీడీ), సాలూరు - జె.శాంతీశ్వరరావు (గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారి), పాలకొండ - ఎల్.అశోక్ కుమార్ (జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ అధికారి), వీరఘట్టం - పి.కిరణ్ కుమార్ ( డిఆర్‌డిఎ పిడి), గుమ్మలక్ష్మీపురం - వై.సత్యంనాయుడు (ఎపిడి, గిరివెలుగు), కురుపాం - బలివాడ సత్యనారాయణ (డిపిఒ), సీతంపేట ఎస్.సింహాచలం (ఇఇ, గిరిజన సంక్షేమ శాఖ, సీతంపేట), భామిని - సి.మల్లిఖార్జున రెడ్డి (డిటిఒ), జియ్యమ్మ వలస - ఎం.డి.నాయక్ (జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ), పాలకొండ (పట్టణం) - టి.రమేష్ (హౌసింగ్ పీడీ), పార్వతీపురం (పట్టణం) - బి.సన్యాసి నాయుడు (జిల్లా సహకార అధికారి), సాలూరు (పట్టణం) - డి.మంజుల వీణ (డివిఇఒ)ను నియమించినట్టు ఆయన చెప్పారు.
జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల పట్ల ప్రజలకు విస్తత అవగాహన కల్పించాలని ఆదేశించారు. వైద్య శిబిరం తేదీ, సమయం, వైద్య నిపుణుల వివరాలు, ఉచిత పరీక్షలు గురించి పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు. శిబిరాలు విజయవంతం కావాలన్నారు. ఆరోగ్య శిబిరాలకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల నుంచి ఒక స్పెషలిస్టు డాక్టర్ హాజరవుతారని చెప్పారు. మండలానికి ఒక గ్రామం చొప్పున రోజూ వైద్య శిబిరాలు కొనసాగుతాయని వెల్లడించారు. దీనివల్ల గ్రామాలు, వార్డుల్లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి గ్రామాల్లోనే స్పెషలిస్టు వైద్యులతో సత్వర వైద్యం అందుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికార, అనధికారులు పాల్గొన్నారు.










