ప్రజాశక్తి - బట్టిప్రోలు
జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా ఉచితంగా ఏడు రకాల వైద్య పరీక్షలు చేస్తున్నట్లు ఎంపీపీ డివి లలిత కుమారి తెలిపారు. మండలంలోని పెదపులివర్రు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం మంగళవారం నిర్వహించారు. రోగులకు బీపీ, షుగర్, జ్వర పరీక్షలు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఎంపీపీ పరిశీలించారు. రోగులకు సూచనలు చేశారు. ప్రభుత్వం ఉచితంగా చేసే ఏడు రకాల పరీక్షలకు బయట వేలాది రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, వైసీపీ నాయకులు మల్లేశ్వరరావు ఉన్నారు.










