Sep 28,2023 22:34

ప్రజాశక్తి - రేపల్లె
సర్వేలో వివరాలను సేకరించడంతోపాటు అవసరాన్ని బట్టి ఇంటివద్దె బిపి, షుగరు, హిమోగ్లోబిన్, యూరిన్, మలేరియా, డెంగ్యూ, ప్రెగ్నెన్సీ వంటి పరీక్షలు హెల్త్ క్లినిక్ సిబ్బంది నిర్వహించి టోకెన్లు పంపిణీ చేస్తున్నామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రమోద్ అన్నారు. మండలంలోని మోళ్లగుంట పిహెచ్‌సి పరిధిలోని బేతపూడి వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ సిబ్బంది ఇంటింటి సర్వే గురువారం ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య వివరాలను యాప్‌లో పొందుపరిచే సర్వే కార్యక్రమం 20రోజులు జరుగుతుందని తెలిపారు. సర్వే అనంతరం వైద్యశిభిరం నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రంగారావు, ఎఎన్ఎం రాజకుమారి, ఎంపీహెచ్ఎ సుబుషన్ బాబు, ఆశా కార్యకర్తలు జ్యోతి, నసీమా పాల్గొన్నారు.