Sep 27,2023 21:29

ఫొటో : వైద్యం చేస్తున్న ఆరోగ్య సిబ్బంది

'జగనన్న ఆరోగ్య సురక్ష'
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద హెల్త్‌ కేర్‌ సెంటర్‌ వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నారు. కొత్తపల్లి గ్రామంలో గత ఐదు రోజులుగా వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి రోగులకు ఏడు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని సిహెచ్‌ఒ సింధు, ఎఎన్‌ఎం నాగమణి తెలిపారు. పరీక్షలు అనంతరం టోకెన్సీ ఇచ్చి అక్టోబర్‌ 9వ తేదీన జరగనున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో వైద్యులతో ఉచితంగా మందులు అందజేస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని కొత్తపల్లి, రాజువారి చింతలపాలెం గ్రామాల ప్రజలు ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు కృష్ణవేణి, వలంటీర్లు పాల్గొన్నారు.