ప్రజాశక్తి- సంతమాగులూరు
ఈనెల 30 నుండి అక్టోబర్ 26వరకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి రాజేష్ కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, వాలంటీర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఇఒ దార్ల దినేష్, పిహెచ్‌సి డాక్టర్ నిర్మల్ కుమార్ పాల్గొన్నారు.










