Sep 09,2023 00:24

మాట్లాడుతున్న ఎంపిడిఒ

ప్రజాశక్తి- చీడికాడ:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జగనన్న ఆరోగ్య సర్వేపై మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మండలంలో అన్ని గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహించాలని ఎంపీడీవో జయప్రకాష్‌ ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు విస్తరించకుండా తక్షణమే సంబంధిత అవసరమగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్యశాఖ అధికారులు డి.అప్పారావు నాయుడు, డాక్టర్‌ సునీల్‌, మండల ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.