
ప్రజాశక్తి -విలేకర్ల బృందం
పదవ తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు పేరిట నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను సోమవారం అందజేశారు.
బుచ్చయ్యపేట : మండలంలోని సీతయ్యపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన కె.రాజులమ్మకు రూ.3000, ద్వితీయ స్థానంలో ఉన్న రౌతు ఇందుకు రూ.2000, తృతీయ స్థానంలో నిలిచిన అనిల్‌కు రూ.1000 చొప్పున నగదు, ప్రశంసా పత్రాలను జెడ్‌పిటిసి దొండ రాంబాబు, వైసిపి మండల అధ్యక్షులు కొలిమల్ల అచ్చం నాయుడు చేతుల మీదుగా పాఠశాలలో అందజేశారు. అలాగే ఒక్కొక్క విద్యార్థికి జెడ్పిటిసి దొండ రాంబాబు రూ.500 చొప్పున తన సొంత నగదును అందించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం విష్ణు, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
మునగపాక రూరల్ : మునగపాక, తోటాడ గ్రామాల్లోని హైస్కూళ్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు జగనన్న ఆణిముత్యాల పేరిట సోమవారం ఘన సత్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు కె.సూర్యనారాయణ, డి.కుమార్, పేరెంట్స్ కమిటీ చైర్మన్లు సూరిశెట్టి భాస్కరరావు, ఆడారి సంతోష్ కుమార్, జెడ్పిటిసి స్వామి సత్యనారాయణ, వైసీపీ మండల కన్వీనర్ ఆడారి గణపతి అచ్చం నాయుడు, పిల్లి అప్పారావు, బొడ్డేడ శ్రీనివాస్, మద్దాల గోవిందు, కాండ్రేగుల వెంకట్ రెడ్డి, పద్మావతి, రామచంద్ర రావు పాల్గొన్నారు.
కశింకోట : కశింకోట డిపిఎన్ బాలురు హైస్కూల్‌లో పదవి తరగతిలో మంచి ప్రతిభ కనబరిక్చన విద్యార్థులు జగనన్న ఆణిముత్యాల పురస్కారాలను వైస్ ఎంపిపి పెంటకోట జ్యోతి చేతుల మీదుగా అందజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన డోకుల బిందుకు రూ.3వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన కొవ్వాడ మోక్షిత, కరణం రాకేష్ రూ.2వేలు, తతీయ స్థానంలో నిలిచిన కౌసర్ సుల్తాన్‌కు వెయ్యి రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి హెచ్‌ఎం ఆచంట రవి, వైసిపి నాయకులు పెంటకొట శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
గొలుగొండ : మండలంలోని ఏఎల్‌పురం జెడ్పీ హైస్కూల్‌లో జగనన్న ఆణిముత్యాల కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ లోచల సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర్‌నాయుడులు విద్యార్ధులకు ప్రోత్సాహకాలు అందజేశారు. చోద్యం స్కూల్‌లో ప్రధానోపాధ్యాయులు రత్నాజీ, వైస్ ఎంపిపి సుర్ల ఆదినారాయణ ప్రోత్సాహకాలు అందజేశారు. జోగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల వైస్ ఎంపీపీ నాగమణి, జక్కు అప్పలస్వామినాయుడు, సర్పంచ్ జువ్వల లక్ష్మి, గొలుగొండ ఉప సర్పంచ్ సేనాపతి రమేష్ పాల్గొన్నారు. గొలుగొండ డాక్టర్ బిఆర్.అంబేద్కర్ గురుకులంలో ఎంపీపీ గజ్జలపు మణికుమారి, సర్పంచ్ కసిపల్లి అప్పారావు, ఉప సర్పంచ్ రమేష్, పాఠశాల కమిటీ చైర్మన్ ద్వారకా రాణి, వైస్ చైర్మన్ నాగేశ్వరరావులు విద్యార్ధులకు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.రామకృష్ణ పాల్గొన్నారు.