Jun 17,2023 00:21

ఆణిముత్యాలు బహుమతులు పొందిన విద్యార్థులతో ఎమ్మెల్యే తదితరులు

ప్రజాశక్తి- చోడవరం
పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో నియోజకవర్గ స్థాయిలో మెరిట్‌ సాధించిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు పథకంలో భాగంగా చోడవరం బాలికల హైస్కూల్‌ ప్రాంగణంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిచ్చి ఖర్చు చేస్తుందని తెలిపారు. ప్రైవేటు విద్యకు దీటుగా విద్యార్థులను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొత్తకోట : చోడవరంలో జరిగిన జగనన్న ఆణిముత్యాల కార్యక్రమంలో అవార్డులకు కొత్తకోట జూనియర్‌ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయ్యారు. వీరిద్దరికీ 15వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ప్రిన్సిపాల్‌ సాయి కుమార్‌ సమక్షంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ అందజేశారు.
పరవాడ : మండలంలోని వెన్నలపాలెం ఎసి కళ్యాణమండపంలో జగనన్న అణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా మెరిట్‌ విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌ రాజ్‌ బహుమతుల ప్రదానం చేశారు. నియోజకవర్గంలో పదవతరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.15 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10 వేలు, తృతీయ బహుమతిగా రూ.5 వేలు, ఇంటర్మీడియట్‌లో నాలుగు గ్రూపుల నుండి మొదటి స్థానంలో నిలిచిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు, జడ్పీటీసీ పైల సన్యాసిరాజు, వైస్‌ ఎంపీపీలు బంధం నాగేశ్వరరావు, బూస అప్పలరాజు, వైసిపి నాయకులు కోన రామరావు, చుక్క రాము నాయుడు, ఎంపిడిఓ హేమ సుందరరావు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వైసిపి నాయకులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.