ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పిచ్చి, ఉన్మాది వ్యాధి లక్షణాలు ఉన్నట్లు ప్రచారం ఉందని, చంద్రబాబు నాయుడు జైలులో ఉంటే జగన్ లండన్‌లో ఉంటూ ఆనందం పొందారని టిడిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బిటి.నాయుడు విమర్శించారు. గురువారం పట్టణంలోని సోమప్ప సర్కిల్‌లో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బీవీ.జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో 2వ రోజూ మైనారిటీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలకు బిటి.నాయుడు, సిపిఐ నాయకులు రంగన్న, పంపన్న గౌడ్ సంఘీభావం తెలిపారు. చంద్ర బాబు అరెస్టుపై ప్రజా అభిప్రాయాలు కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా బిటి, మాజీ ఎమ్మెల్యే బీవీ మాట్లాడారు. ఇతరులను బాధపెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న జగన్‌ను పిచ్చి కుక్కను తరిమినట్లు తరిమి కొట్టాలని కోరారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు వంతు అయిపోయిందని, తర్వాత ప్రజల వంతు వస్తుందని చెప్పారు. రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెట్టి టిడిపిని దెబ్బతీయాలని చూస్తున్నారని తెలిపారు. టిడిపి నాయకులు సుందర్ రాజు, కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్, దయాసాగర్, రంగస్వామి గౌడ్, రామకృష్ణ నాయుడు, దామ నరసింహులు, మధుబాబు, కలీముల్లా, బందే నవాజ్, పార్లపల్లి మల్లికార్జున, కొండన్న గౌడ్, శంకర్ గౌడ్, కోటేకల్ ఖాజా, దాదావలీ, మునీర్, సలీం, సలాం, గౌస్, నజీర్, హుసేన్ పీరా, అల్తాఫ్, జయన్న, అంబేద్కర్, అబ్దుల్లా, నాగుర్ బాష, వడ్డే కృష్ణ, శిల్పి భాస్కర్, జహంగీర్, పట్టా నాగరాజు, డాక్యుమెంటరీ రైటర్ రవి, కందనాతి కేసన్న, అయ్యాలప్ప, అంజి, బోయ రంగన్న పాల్గొన్నారు.
దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న బిటి.నాయుడు










