Nov 14,2023 20:52

వీరవాసరం:ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని నమ్మి వచ్చే ఎన్నికల్లో లబ్ధిదారులు మరలా ఓట్లు వేస్తే జగన్‌ మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఎఎంసి ఛైర్మన్‌ కోటిపల్లి బాబు అన్నారు. ఆంధ్రాకు జగన్‌ ఎందుకు కావాలి కార్యక్రమం మంగళవారం వీరవాసరం సచివాలయం-2లో మండల కన్వీనర్‌ కడలి ధర్మారావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచి చికెలే మంగతాయారు, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ గొలగాని సత్యనారాయణ, ఎంపిటిసి బొల్లంపల్లి శ్రీనివాస్‌ చౌదరి పాల్గొన్నారు.
మొగల్తూరు:వైసిపికి ప్రజలతోనే పొత్తనీ పార్టీలతో కాదని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మంగళవారం ముత్యాలపల్లి, కొత్తట గ్రామాల్లో వైనీడ్‌ ఎపి సిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సచివాలయాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశాల్లో ముదునూరి మాట్లాడారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా సచివాలయాల వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్‌పిటిసి తిరుమాని బాపూజీ పాల్గొన్నారు
పెనుమంట్ర:పెనుమంట్ర-1 సచివాల యం వద్ద జగనన్న ఎందుకు రావాలి కార్యక్రమానికి గ్రామ సర్పంచి తాడిపర్తి ప్రియాంక అధ్యక్షత వహించారు. ముందుగా అభివద్ధి కార్యక్రమాల ప్రచార సమాచార బోర్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసు రెడ్డి) మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో, ప్రస్తుతం వైసిపి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా ఉందో ప్రజలు గమనించాలన్నారు. అనంతరం హైస్కూల్‌ ఆవరణలోని వైసిపి జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచి భూపతిరాజు వెంకటశ్రీనివాసరాజు, ఎఎంసి ఛైర్మన్‌ వెలగల వెంకటరమణ, గ్రామ అధ్యక్షుడు తేతలి సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.