
ప్రజాశక్తి - భోగాపురం : వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని సవరవల్లి పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు గడగడపకు కార్యక్రమం పేరుతో ప్రజల మద్యనే ఉన్నామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించే కార్యక్రమం చేపట్టామన్నారు. వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ మండలం మళ్లీ అభివృద్ది చెందాలంటే ఈ ప్రభుత్వమే మనకు అవసరమని అన్నారు. సవరవల్లి పంచాయతీపై ఎమ్మెల్యేకు ఎనలేని అభిమానమన్నారు. అందుకు ఆయనను మళ్లీ గెలిపించుకోవాలని కోరారు. ఈ కారయక్రమంలో ఎంపిపి ఉప్పాడ అనూషరెడ్డి, సవరవల్లి సర్పంచ్ ఉప్పాడ విజయభాస్కరరెడ్డి ఎంపిటిసి పట్నా తాతయ్యలు, ఎంపిడిఒ అప్పలనాయుడు, వైద్యాధికారి తిరుపతిస్వామి, నాయకులు పడాల శ్రీనివాసరావు, సుందర హరీష్, అప్పురభుక్త పైడినాయుడు తదితరులు పాల్గొన్నారు.
460 మందికి ఆరోగ్య తనిఖీలు
కొత్తవలస: స్థానిక పిహెచ్‌సి పరిధిలోని కొత్తవలస -5 సచివాలయంలో గల రాజపాత్రునిపాలెం, చీపురువలస, ఎర్రవాణిపాలెంలో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష ఉచిత మెగా వైద్యశిభిరం లో 460 మందికి తనిఖీలు చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ డి.సీతల్ వర్మ తెలిపారు. సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా వైద్య శిభిరం ఏర్పాటు చేసినట్లు పంచాయతీ సెక్రటరీ ఇ. కన్నబాబు తెలిపారు. ఎంపిపి నీలం శెట్టి గోపమ్మ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం విద్యకి, వైద్యానికి పెద్ద పీటవేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు వైస్ ఎంపిపి కర్రి శ్రీను, అయ్యారకాల పాత్రుని డైరెక్టర్ రామన్న పాత్రుడు, ఎంపిడిఒ వై. పద్మజ, ఇఒపిఆర్‌డి ధర్మారావు, నాయకులు బాలరాజు, ఏడుకొండలు, సూరిబాబు, వైద్యులు సింహాద్రినాయుడు, జ్యోతిర్మయి, మాధురి సుధ, రామలక్ష్మి, ఈశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.