Apr 08,2023 22:31

ప్రజాశక్తి - ముసునూరు
             నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సిఎం జగన్‌ అందరి మన్ననలు పొందుతున్నారని నూజివీడు ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అన్నారు. మండలంలోని లోపూడి గ్రామపంచాయతీ శివారు బసవరప్పాడులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీసి, ఆందరికి ఆందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు వరికూటి ప్రతాప్‌, వైస్‌ ఎంపిపి కోటగిరి రాజానాయన, నాయకులు బి.నరసింహారావు, పార్టీ మండల అధ్యక్షులు మూల్పూరి నాగవల్లేశ్వరరావు, సర్పంచి పేరం కృష్ణ, సర్పంచులు రంగు ధనలక్ష్మిగాంధీ, రాజబోయిన శ్రీదేవిశ్రీనివాసరావు, చలసాని దామోదర్‌రావు, ఇన్‌ఛార్జిఎంపిడిఒ బసవరాజు అచ్యుతసత్యనారాయణ, తహశీల్దార్‌ దాసరి సుధ, పంచాయతీరాజ్‌ ఎఇ టివి.నరసింహారావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.