Oct 19,2023 20:37

కరపత్రాలను పంపిణీ చేస్తున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ

ప్రజాశక్తి-శృంగవరపుకోట : సిఎం జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ విమర్శించారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మండలంలోని మామిడిపల్లి గ్రామంలో బాబుతో నేను అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గొంప కృష్ణ గ్రామంలో ఇంటింటికీ తిరిగి చంద్రబాబు అరెస్టు అక్రమమని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రజలకు వివరించారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అరాచక పాలన పోవాలి, చంద్రన్న పాలన రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని కృష్ణ తెలిపారు. సంకెళ్లు వేసుకోవాల్సిన వారు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం 2024లో మనందరం యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు లగుడు రవికుమార్‌, రాయవరపు చంద్రశేఖర్‌, జుత్తాడ రామసత్యం, ఇప్పాక త్రివేణి, మాదిబోయిన మంగరాజు, ఆడారి ఉమామహేశ్వరరావు, లగుడు ఎర్రినాయుడు, గనివాడ సన్యాసినాయుడు, కోరుకొండ శ్రీనివాసరావు, మండా త్రినాథ్‌, సిమ్మా అప్పారావు, దండుపాటి ఎర్రినాయుడు, బాదిరెడ్డి సన్యాసినాయుడు పాల్గొన్నారు.