ప్రజాశక్తి- దేవరాపల్లి
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టిడిపి మాడుగుల నియోజకవర్గం ఇన్‌ఛార్జి పివిజి.కుమార్, నాయకులు పైలా ప్రసాదరావు అన్నారు. గురువారం రాత్రి మండలంలోని బొయిలకింతాడ గ్రామంలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొప్పాక కాసుబాబు, కోమార బాబురావు, పోతల పాత్రునాయుడు, కర్రి నాయుడు, బండారు రామారావు, చింత సాంబమూర్తి, కడియం నాగేశ్వరరావు, రాయపురెడ్డి ఈశ్వరరావు పాల్గొన్నారు.
వైసిపికి రోజులు దగ్గర పడ్డాయి
మునగపాక రూరల్ : వైసిపి ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని తెలుగు రైతు నాయకులు దాడి ముసిలినాయుడు అన్నారు. స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని గురువారం రాత్రి టిడిపి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ధరలు పెంచి సామాన్యులను పాతాళానికి తొక్కుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దాడి శివ, పెంటకోట విజరు, ప్రసాద్, మొల్లేటి సత్యనారాయణ, ఆడారి గోవిందు, డొక్కా నాగభూషణం, విళ్లురి నూక నరసింహారావు, పరశురాం, పాల్గొన్నారు.
జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలి : బండారు
సబ్బవరం : వ్యాపారస్తుల నడ్డి విరుస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలని, లేకుంటే వ్యాపారులందరూ రోడ్డున పడే ప్రమాదం ఉందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. శుక్రవారం సబ్బవరంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భరిణికాన సాయినాథరావు, పెందుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బోకం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఇదేం ఖర్మ వ్యాపారస్తులకు కార్యక్రమంలో బండారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జగన్ ప్రభుత్వం చిరు వ్యాపారం నుండి పెద్ద వ్యాపారాల వరకు అందరిపైనా అధిక పన్ను భారాలు మోపిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, గండి రవికుమార్, బండారు అప్పలనాయుడు, డి.ప్రసాదరావు, మాసవరపు అప్పలనాయుడు, గండి దేముడు, కొటాన అప్పారావు, బొండా సత్యారావు, రేసుపూడి రమణ, పడాల వెంకట రమణ, పల్లా తాతారావు, కోరాడ శ్రీనివాసరావు, దొడ్డి సూర్య ప్రకాష్, గొర్లి చైతన్య, కరక దేముడు, వియ్యపు చిన్న, ఎం.అక్కుబాబు తదితరులు పాల్గొన్నారు.










