Oct 28,2023 23:29

ప్రజాశక్తి-యంత్రాంగం జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పలువురు టిడిపి నాయకులు పిలుపు ఇచ్చారు. జిల్లాలోని పలుచోట్ల పార్టీ సమావేశాలు నిర్వహించారు. కాకినాడ ఓటమి భయంతో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నేతలు పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదుకు కుట్రలు పన్నుతున్నారని కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో శనివారం కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తతస్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత ఎన్‌టిఆర్‌ విగ్రహానికి కొండబాబు, నియోజకవర్గ పరిశీలకుడు నాగీడి నాగేశ్వరరావు, మల్లిపూడి వీరు పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టు, వైసిపి ప్రభుత్వం వైఫల్యాలు, భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలు, ఓటర్‌ వెరిఫికేషన్‌, తదితర కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నగర పలివెల రవి, ఎన్‌.విశ్వనాథం, గదులు సాయిబాబా, తుమ్మల రమేష్‌, అంబటి చిన్న, ఒమ్మి బాలాజీ, సీకోటి అప్పలకొండ, బంగారు సత్యనారాయణ, రహీమ్‌, దండుప్రోలు నాగబాబు, చింతా పేర్రాజు పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ మండలంలోని బలభద్రపురంలో శనివారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రచారం నిర్వహించారు. టిడిపి మండల అధ్యక్షులు మారిశెట్టి భద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌విఎస్‌.అప్పలరాజు పాల్గొని ప్రసంగించారు. టిడిపి అధినేత చంద్రబాబు ఇచ్చిన మిని మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాలురి బోసుబాబు, కంచుమర్తి రాఘవ, కొత్త కొండబాబు, బస్వా చినబాబు, మరోతి కృష్ణ, కుమారి, సుజాత, రాపాక లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. కోటనందూరు జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి యనమల కృష్ణుడు అన్నారు. తునిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుర్ల లోవరాజు, ధారకొండ వెంకటరమణ, మోతుకూరి వెంకటేష్‌, చోడిశెట్టి గణేష్‌, వంగలపూడి బుజ్జి, వంగలపూడి నాగేంద్ర, చిటికెల శ్రీనివాస్‌, పలివెల లోవరాజు, మళ్ల గణేష్‌, అద్దేపల్లి బాలాజీ పాల్గొన్నారు. తాళ్లరేవు నవంబర్‌ 1 నుంచి 'బాబు ష్యూరిటీ భవిష్యత్తు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని టిడిపి ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి దాట్ల సుబ్బరాజు అన్నారు. పార్టీ మండల కార్యాలయంలో విస్తతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటింటికీ వెళ్లి క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌ఛార్జిలకు అవగాహన కల్పించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి మాట్లాడుతూ తెలుగుదేశం విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు కాల సత్తిబాబు, రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, నడింపల్లి సుబ్బరాజు, అర్దాని శ్రీనివాసరావు, గొలకోటి దొరబాబు పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎంఎల్‌ఎ అనంతలక్ష్మి జిల్లా టిడిపి కార్యాలయంలో జరిగిన విస్తత స్థాయి సమావేశంలో మాట్లాడారు.