జగన్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి అధోగతి: టిడిపి
ప్రజాశక్తి -చిట్టమూరు: జగన్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి అధోగతి పాలయిందని నియోజకవర్గ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి, మహా జనసైన్యం రాష్ట్ర అధ్యక్షుడు యల్లసిరి నాగార్జున పేర్కొన్నారు. టిడిపి మండల అధ్యక్షులు గనపర్తి కిషోర్ నాయుడు, యూనిట్ ఇన్‌చార్జి కస్తూరయ్య సూచనల మేరకు ఈశ్వర వాక స్థానిక కాలనీలో టీడీపీ 'భవిష్యత్తుకు గ్యారెంటీ -ఇది బాబు గ్యారెంటీ'ని శుక్రవారం నిర్వ హించారు. ఈ సందర్భంగా యల్లసిరి నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని, భవిష్యత్తు గ్యారెంటీ పథకాలతో వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధిని అధోగతి పాలు చేశారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. టీడీపీలో కష్టపడి పనిచేసిన కార్య కర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాలయ్య, భూపయ్య, రంగయ్య, శ్రీను, మహేంద్ర, సునీల్, కుటుంబ సాధికార సారథి జనార్ధన్ పాల్గొన్నారు.










