Jul 24,2023 22:09

చైతన్యరథం ప్రారంభిస్తున్న పల్లె

పుట్టపర్తి అర్బన్‌ : జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో సత్యమ్మ గుడి వద్ద మహాశక్తి చైతన్య రథంను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ, మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మహిళల కోసం ప్రకటించిన పథకాలన్నీ ఎంతో ఉపయోగపడతాయని వీటిని 40 రోజులపాటు నియోజకవర్గంలో చైతన్య రథం ద్వారా టిడిపి మహిళలు, కార్యకర్తలు ప్రజలకు వివరిస్తారన్నారు. అనంతరం అక్కడ ఉన్న చిరు వ్యాపారులను పలకరించి వారి వ్యాపారాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ కన్వీనర్‌ రామాంజనేయులు, నాయకులు మహమ్మద్‌ రఫీ, సామ కోటి ఆదినారాయణ, సాలక్క గారి శ్రీనివాసులు, బొమ్మయ్య, మనోహర్‌, కోనంకి గంగాధర్‌, జయప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.