Sep 22,2023 19:49

ప్రజలతో మాట్లాడుతున్న ప్రదీప్‌ రెడ్డి

ప్రజాశక్తి - కౌతాళం
ప్రజలు జగన్‌ ప్రభుత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నారని వైసిపి రాష్ట్ర యువ నాయకులు వై.ప్రదీప్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు కౌతాళం మండలం కుంబాలనూరు గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగానికి పెద్ద పీట వేసినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులు ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎంపిపి అమ్రేష్‌, వైసిపి నాయకులు రామలింగయ్య స్వామి, సర్పంచి వీరేష్‌, నాయకులు రామన్న గౌడ్‌, హాల్వి చెన్నప్ప, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ అశ్వత్థామ, ఎంపిడిఒ సుబ్బ రాజు, విద్యా శాఖ అధికారి శోభా రాణి, విద్యుత్‌ ఎఇ నరసన్న పాల్గొన్నారు.