
ప్రజాశక్తి- కంచిలి: నాలుగున్నరేళ్లలో జగన్ పరిపాలనంత అవినీతిమయమే అని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. మండలంలోని ఎస్సార్సీపురంలో బాబు షూరిటీ-భవిష్యత్‌కు గారంటీ కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలసి సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు ప్రకటించిన వివిధ పథకాలను గురించి తెలియచేశారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గురించి వివరించారు. ప్రతి అంశంలోనూ అవినీతి తప్ప... పాలన ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు మాదిన రామారావు, టి.వి.రమణ, కురయ్య, ఎం.ఎం.పట్నాయక్, వి.రవి పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు : మండలంలోని హుకుంపేటలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆధ్వర్యా న బాబు ష్యూరిటీ-భవిష్యత్ నిర్వహించారు.
గార : గారలోని బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఇంటింటికీ వెళ్లి పోస్టర్లను అందజేశారు. కార్యక్రమంలో రాధాకృష్ణారెడ్డి, రాజేష్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
బూర్జ : మండలంలోని పాలవలసలో నిర్వహించిన బాబు షూరిటీ-భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంలో టిడిపి బిసి సెల్ అధ్యక్షులు మామిడి దుర్గారావు, దాసిరెడ్డి వెంకనాయుడు, జల్లు పోలునాయుడు, కడగల కృష్ణ, నారాయణరావు పాల్గొన్నారు.