Oct 25,2023 21:36

ప్రజాశక్తి - తాళ్లపూడి దేశంలో ఏ రాష్ట్రం లోని జరగని అభివృద్ధి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలనలో ఆంద్ర óప్రదేశ్‌ రాష్ట్రంలోనే జరిగిం దని మంత్రి అంబటి రాంబాబు అన్నా రు. మండలంలోని తాడిపూడి గ్రామంలో ప్రాధాన్యత భవ నాలను అంబటి రాంబాబు, మంత్రి తానేటి వనిత సంయుక్తం గా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. నాడు నేడు కింద పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే స్కూల్స్‌ను అభివృద్ధి చేయడం అభివృద్ధి కాదా ? అని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యం కోసం వెల్‌ నెస్‌ సెంటర్స్‌ నిర్మించామని, తల్లుల ఖాతాకు రూ.15 వేలు అమ్మఒడి పథకం ద్వారా ఆర్థిక చేయూత నివ్వడం అభివృద్ధి కాదా? అని నిలదీశారు. మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో సాధ్యం కానీ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం జరుగుతుందన్నారు.కొవ్వూరు నియోజకవర్గంలో ఎన్నో జలవనరుల ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని, వాటి నిర్వహణ కోసం సిఎం హామీ ఇవ్వడం జరిగిందన్నారు. పైడిపట్ల ఎత్తిపోతల పథకం కింద గూటాల పంపింగ్‌ స్కీం కింద వచ్చే ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఇక్కడి రైతాంగం కోరికను నెరవేర్చాలన్నారు.
వంచించిన వారిని ఎలా నమ్మేది
14 సంవత్సరాల పాటు అనేక సేవలు అందించామని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు స్కాములకు చిరునామాగా మారారని, ఆయనను నమ్మి మద్దతు పలుకుతున్న దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ ఏనాడు తన సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదని అటువంటి నాయకులను ప్రజలు ఎలా నమ్మేది అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలను ప్రజలకు వివరించడంతోపాటు కాపుల కోసం పవన్‌ కళ్యాణ్‌ పట్టించుకోకపోవడం చంద్రబాబు కాపుల కోసం చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. నిజం గెలవాలి అంటూ నారా భువనేశ్వరి చేస్తున్న యాత్రపైనా ఆయన విమర్శనాస్త్రాలను సంధించారు. 'అమ్మ నిజం గెలవాలని కాదు..అబద్ధం గెలవాలని యాత్ర చేస్తే బాగుంటుంది. నిజం గెలవాలంటే మీ ఆయన జైలు నుంచి బయటకు రారు. అబద్ధం గెలవాలని చేస్తే మీ ఆయన బయటకు వస్తారు' అని ఎద్దేవా చేశారు. సర్పంచ్‌ నామ గోపాలం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్‌ పిడి కె. విజయ కుమారి, సిడిపిఒ డి.మమ్మి, వ్యవసాయ శాఖ జెడి.మాధవరావు, ఆర్‌డిఒ ఎస్‌. మల్లిబాబు, జడ్‌పి వైస్‌ ఛైర్మన్‌ పోసిన శ్రీలేఖ, ఎఎంసి ఛైర్మన్‌ వల్లభసెట్టి శ్రీను, తాళ్లపూడి ఎంపిపి జొన్నకుటి పోసిరాజు, పోలవరం ఎంపిపి సుంకర వెంకటరెడ్డి, వైసిపి నాయకులు గూడ విజయరాజు పాల్గొన్నారు.