Nov 20,2023 20:06

చిప్పగిరిలో బోర్డును ఆవిష్కరిస్తున్న ప్రజా ప్రతినిధులు

ప్రజాశక్తి - చిప్పగిరి
ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలనలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినట్లు ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ, వైసిపి మండల కన్వీనర్‌ జూటూరు మారయ్య, సర్పంచి ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం మండలంలోని నేమకల్లు గ్రామంలో సర్పంచి ప్రేమ్‌ కుమార్‌ అధ్యక్షతన జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న 'సంక్షేమ పథకాల బోర్డు'ను ఆవిష్కరించారు. 'ఎపికి జగనే ఎందుకు కావాలి'పై గ్రామంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, గ్రామస్తులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామానికి వివిధ సంక్షేమ పథకాల కింద దాదాపు రూ.26.51 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సంక్షేమ పథకాలన్నీ మళ్లీ పొందాలంటే 2024లో జగన్మోహన్‌ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో పెద్దలతో సమావేశమై, గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని అక్కడే పల్లెనిద్ర నిర్వహించారు. ఎంపిటిసిలు బుడ్డ సుంకన్న, భీమలింగ, అసెంబ్లీ బూత్‌ కన్వీనర్‌ రాజన్న, సచివాలయ కన్వీనర్లు గిరి, గురునాథ, వైసిపి నాయకులు డాక్టర్‌ వీరాంజనేయులు, సత్తిరెడ్డి, గురుదాసు, శ్రీనివాసులు, సుంకన్న, ఎర్రి స్వామి, వైసిపి ఎస్సీ మండల కన్వీనర్‌ నాగరాజు, నెట్టి, తిప్పయ్య, ఎంపిడిఒ సివి.కొండయ్య, ఇఒఆర్‌డి బాలన్న పాల్గొన్నారు. దేవనకొండ మండలంలోని నేలతలమర్రి గ్రామంలో 'ఎపికి జగనే ఎందుకు కావాలి' నిర్వహించారు. జడ్‌పిటిసి కిట్టు, వైసిపి మండల కన్వీనర్‌ కప్పట్రాళ్ల మల్లికార్జున, ఎంపిపి భర్త లుముంబ, వ్యవసాయ సలహా సంఘం మండల అధ్యక్షులు హంపిరెడ్డి, జెసిఎస్‌ మండల కోఆర్డినేటర్‌ రాజారెడ్డి మాట్లాడారు. నేలతలమర్రి గ్రామ సచివాలయ పరిధిలో రూ.16.39 కోట్లు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఇఒఆర్‌డి సూర్యనారాయణ, వైసిపి నాయకులు జయరామ్‌, సహదేవుడు పాల్గొన్నారు.

దేవనకొండలో మాట్లాడుతున్న హంపి రెడ్డి
దేవనకొండలో మాట్లాడుతున్న హంపి రెడ్డి