మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, టిడిపి నేతలు
ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని రంపచోడవరం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ పరిశీలకులు యర్రా వేణుగోపాల్ ధ్వజమెత్తారు. ఆదివారం రాజవొమ్మంగిలో మండల టిడిపి అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా సింగంపల్లి నుంచి జడ్డంగి వరకు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జడ్డంగి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జమ్మిసావిడిలో వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నంబాబు రమేష్, పార్టీ పరిశీలకులు యర్రా వేణుగోపాల్ తదితరులు మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వ పాలనలో సామాన్య మధ్యతరగతి ప్రజలుతోబాటు, కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడిపి, ఇతర ప్రతిపక్షాలపై, గిరిజనులపై దాడులు విపరీతంగా పెరగాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్దంగా పోరాటం చేస్తున్న టిడిపి ఎమ్మెల్యేలు, నాయకులపై నిర్బంధం కొనసాగిస్తోందని, అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వైసిపి పాలనలో ఏజెన్సీలో ఇసుమంతైనా అభివృద్ధి జరగలేదని, కనీస వసతులు లేక గిరిజనం నానా ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. మరోవైపు ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల బతుకులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దుర్భరం చేశాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో టిడిపి కేడర్ సర్వసన్నద్ధంగాఉండాలని, తెలుగుదేశం గెలుపు, చంద్రబాబును సిఎం చేయడమే లక్ష్యంగా అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి ఉపాధ్యక్షులు డి శివరామచంద్రరాజు, మండల కార్యదర్శి ఎం.డింబకేశ్వరరావు, టిడిపి జిల్లా, మండల నేతలు జి సునీత, నిరంజనీదేవి, శ్రీకాంత్, టి ప్రభ, బోసుబాబు పాల్గొన్నారు.
ఫొటోరైటాప్,,%తీjఙఎ%02,, వాహన తనిఖీలు చేపడుతున్న ఎస్‌ఐ నరేంద్ర ప్రసాద్.










