Oct 09,2023 22:02

ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సామినేని, మేక ప్రతాప్‌ అప్పారావు, ఆకుల శ్రీనివాసకుమార్‌

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : సిఎం జగనన్న పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తోందని వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన వైసిపి దశ నిర్దేశా కార్యక్రమంలో సిఎం జగన్‌ పార్టీ శ్రేణులకు చక్కటి మార్గదర్శనం చేశారని కొనియాడారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు తీసుకు వచ్చిన ఘనత జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం గత టిడిపి ప్రభుత్వంలో -6.5 శాతం నుండి రైతు పక్షపాతి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత 8.2 శాతానికి పెంచిన ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ జిల్లాలోని ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక అరుణ్‌ కుమార్‌, నూజివీడు ఎమ్మెల్యే మేక ప్రతాప్‌ అప్పారావులతో కలిసి తాను స్వయంగా పాల్గొనడం జరిగిందనీ ఆకుల శ్రీనివాస్‌ పేర్కొన్నారు.