Oct 08,2023 17:50

ప్రజాశక్తి - ముసునూరు
    రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవగాహనలేని పరిపాలన కొనసాగిస్తూ, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని సూరేపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి శ్రేణులు చేస్తున్న నిరహార దీక్షకు మద్దతు తెలిపారు. ఈ నిరాహార దీక్షలో గద్ధే రఘుబాబు, మల్లిబాబు, కొక్కరిపాటి శోభనాద్రి, లక్కపాము కాంతారావు, పనగంట నాగేశ్వరారవు, రఘుబాబు, ఓబేలినేని ప్రసాద్‌, కొల్లి వెంకటేశ్వరరావు, గూట్రు వెంకటేశ్వరరావు, గూట్రు వలరాజు, కట్టుబోయిన సత్యం, గూట్రు అర్జునరావు, గూట్రూ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా జంగారెడ్డిగూడెంలో టిడిపి కార్యాలయం, పట్టణ టిడిపి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 26వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం మండలంలోని గురవాయిగూడెంలో మండల టిడిపి అధ్యక్షులు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేకా ఈశ్వరయ్య, మాజీ ఎంఎల్‌ఎ గంటా మురళీ రామకృష్ణ, గోర్రుముచ్చు గోపాల్‌ యాదవ్‌లు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును జనసేన తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపిని ఓడించేందుకు పోరాడుతామని తెలిపారు. జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ పిలుపు మేరకు జనసైనికులు టిడిపితో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనికెళ్ల శ్రీనివాస్‌, పరిమి శ్యామ్‌, పొన్నగంటి అనిల్‌, దండమూడి రమణ, పరిమి వెంకట్రావు, మండవ లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.