
ప్రజాశక్తి - పెనుకొండ : జగన్ పాలనలో రాష్టం రావణ కాష్టంలా మారిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లో 15 వ రోజు సామూహిక రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చినప్పటి నుండి అరాచక పాలన సాగుతుందన్నారు. అనంతరం దీక్షలో పాల్గొన్న నాయకులకు కార్యకర్తలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.ఈ రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు,జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : ముఖ్యమంత్రి జగన్‌కు రాక్షస ఆనందం ఇక కొన్ని రోజులేనని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పరిటాల శ్రీరామ్ చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి ప్రజలకు వివరించారు. సైకో ప్రభుత్వాన్ని ప్రశ్నించి...బాబుతో నేను అంటూ గొంతెత్తి చాటాలని ప్రజాచైతన్య కరపత్రాన్ని పంపిణీచేశారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముదిగుబ్బ : చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా ముదిగుబ్బ తెలుగుదేశం పార్టీ నాయకులు ముదిగుబ్బ చెరువులో జల దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తుమ్మల మనోహర్, తుమ్మల సూరి, నారాయణస్వామి, గడ్డం మోహన్, రియాజ్ బాషా, జయచంద్ర, ప్రతాప్, చంద్ర, అయూబ్ ఖాన్,చంద్ర, బాలాజీ, సాయి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : చంద్రబాబునాయుడును విడుదల చేసేవరకు పోరాడుతామని టీడీపీ నాయకులు అన్నారు. చంద్రబాబు అక్రమఅరెస్టును వ్యతిరేకిస్తూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గరుగువెంగప్ప, సత్యనారాయణ ఆచారి, శ్రీనివాసులు, నాగరాజు, కుళ్లాయప్ప, షపీ, రవి,తిరుపాలు, లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కందికుంట ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 18వ రోజు కొనసాగాయి మేము సైతం బాబుతో అంటూ కదిరి నియోజకవర్గం రజక సంఘం ఆధ్వర్యంలో పాల్గొని బట్టలు ఉతుకుతూ తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కందికుంట మాట్లాడుతూ టిడిపికి మొదటినుంచి బీసీలు అండగా నిలుస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల కన్వీనర్ చెన్నకేశవులు, మోపురిశెట్టి చంద్రశేఖర, మాజీ సర్పంచులు, టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తలుపుల : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తలుపుల మండలం కేంద్రంలో టిడిపి నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎద్దుల రాముడు, కెసి. పండు, మస్తాన్‌వలి, షాకీర్, నారాయణ బాబు తదితరులు పాల్గొన్నారు.
అమరాపురం: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టిడిపి మండల కన్వీనర్ గణేష్ ఆధ్వర్యంలో బాబు కోసం మేము కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. వీరు హేమావతి గ్రామం వరకు నిర్వహించిన పాదయాత్రలో ప్రజలు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ మల్లికార్జున, మాజీ జెడ్పీటీసీ నరసింహామూర్తి, మాజీ ఎంపీపీ కృష్ణమూర్తి, మాజీ సర్పంచి కుమార్ స్వామి, కేంకర నింగేగౌడ తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి అర్బన్ : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టిడిపి నాయకులు వినూత్న నిరసన తెలిపారు. చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్న రీతిలో టిడిపి శ్రేణులు నిరసన తెలిపారు. బుధవారం టిడిపి కార్యాలయం ముందు చేపట్టిన నిరసన కార్యక్రమం 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చంద్రబాబును అరెస్టు చేశారని ఇలాంటి నీతిమాలిన చర్యలు వైసిపి ప్రభుత్వం మానుకోవాలని లేదంటేఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వీరి దీక్షలకు సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పరిశీలకులు బచ్చల పుల్లయ్య, టిడిపి నాయకులు రత్నప్ప చౌదరి, సామకోటి ఆదినారాయణ, అంబులెన్స్ రమేష్, బొమ్మయ్య, శ్రీరామ్ రెడ్డి, ఆరు మండలాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : చంద్రబాబునాయుడును వెంటనే విడుదల చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదేశాలమేరకు పోస్టుకార్డుల ఉద్యమాన్ని మహిళలు బుధవారం చేపట్టారు. చంద్రబాబును విడుదల చేయాలని ప్రజల నుంచి పోస్టుకార్డుల ద్వారా సంతకాలు చేయించి వాటిని రాష్ట్రపతికి పంపుతున్నట్లు నాయకులు చెప్పారు.
మడకశిర రూరల్ : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆధ్వర్యంలో నాయకులు బుధవారం మడకశిర చెరువులో జల దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర వక్కిలిగ కన్వీనర్ పాండురంగప్ప, టిడిపి నాయకులు రామకృష్ణ, నరేష్, శివ, రంగనాథ్ పాల్గొన్నారు.
హిందూపురం : చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ 15వ రోజు చేపట్టిన దీక్షల్లో బిసి నాయకులు పాల్గోన్నారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో బిసి నాయకులు ర్యాలీ చేపట్టి, మానవ హారంగా ఏర్పాడి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జెఇ వెంకట స్వామి, కొల్లకుంట అంజినప్ప, దుర్గా నవీన్, అమర్నాథ్, అంజినప్ప, నబి, చంద్ర శేఖర్ యాదవ్, రమేష్ కుమార్, బేవినహళ్లి ఆనంద్, మంగేష్ తదితరులు పాల్గొన్నారు.