Aug 31,2023 23:52

ప్రజాశక్తి - నగరం
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. మండలంలోని చిన్నమట్లపూడి లో గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నమట్లపూడి ఫకీరయ్యపాలేనికి చెందిన ప్రజలు స్మశానవాటికకు దారి కావాలని కోరారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ద్వారా దారి పనులు ప్రారంభించాలని ఎంపీ మోపిదేవి అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని అన్నారు. ఎన్నికల హామీలన్నీ అమలు చేశారని అన్నారు. నవరత్నాలలోని సంక్షేమ పథకాలు దేశంలో అందరికీ ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని అన్నారు. అవినీతికి తావులేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ చింతల శ్రీ కృష్ణయ్య, సర్పంచ్ గుల్జార్ గాలిబ్, ఎంపిటిసి కరీమ్, ఆలిబండా, కరిముల్లా పాల్గొన్నారు.