Aug 28,2023 23:59
గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొన్న మోపిదేవి వెంకటరమణ

ప్రజాశక్తి-నగరం: సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. మండలంలోని ధూళిపూడి గ్రామంలో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నూటికి నూరు శాతం నెరవేర్చరని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య, ఎంపిడిఓ చక్రపాణి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు.