Sep 06,2023 20:53

సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటి టౌన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాలకు, పేదలకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గొర్లము దివీడు గ్రామంలో ఉదయం 6. 30 గంటలకే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంను అయన ప్రారంభించారు. గ్రామం లోని ఆరవ వాండ్లపల్లె, ఏపిలవంకపల్లె, వల్లూరు వాండ్లపల్లె, చెరువు ముందర కొత్తపల్లె, బోయపల్లె, బాలిరెడ్డిగారిపల్లె, హరిజన వాడలలో గడప గడపనూ శ్రీకాంత్‌రెడ్డి సందర్శిస్తూ సంక్షేమ పథకాలను వివరిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక చొర చూపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్నింటిలో బిసిలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. బిసి లంటే బ్యాక్‌ వర్డ్‌ క్యాస్ట్‌ కాదు బ్యాక్‌ బోన్‌ అని ప్రభుత్వం నిరూపించిందన్నారు. వైఎస్‌ఆర్‌ చేయూత, నేతన్న హస్తం, రజకులు, టైలర్లు, నాయీ బ్రాహ్మణులు , ఆటో వాలా లకు ఆర్థి సహాయం, బిసిలకు చెందిన విద్యార్థుల తల్లులకు ఆమ్మఒడి తదితర పథకాల ద్వారా సింహభాగం బిసిలు లబ్దిపొంది ఆర్థికంగా అభివద్ధి చెందేలా సిఎం జగన్‌ కషి చేస్తు న్నారన్నారు. జగన్‌ పాలనలోనే సామాజిక న్యాయం జరుగుతోందన్నారు. 53 కార్పోరేషన్‌ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారితో పాటూ వార్డు మెంబర్ల వరకు బిసి కుటుంబం జన సముద్రంలా ఉందన్నారు. 82వేలమంది బిసిలు రాజకీయ సాధికారతతో పదవుల్లో ఉన్నారని, బిసిల హదయంలో జగన్‌ ఉన్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత జగన్‌ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కార్యక్ర మంలో స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ డైరెక్టర్‌ పోలు సుబ్బారెడ్డి, టిటిడి ప్రాంతీయ సలహా మండలి సభ్యుడు బసిరెడ్డి సిద్దారెడ్డి, మాజీ వైస్‌ ఎంపిపి గంగిరెడ్డి, మండల బిసి నాయకుడు పల్లపు రమేష్‌, సింగల్‌విండో అధ్యక్షుడు బసిరెడ్డి సుబ్బారెడ్డి, ఎంపిడిఒ మల్‌రెడ్డి, సర్పంచ్‌ రాజమ్మ రఘునాథ, కాంట్రాక్టర్‌ చలమారెడ్డి, రాజారెడ్డి, బిసి నాయకుడు ఈశ్వరయ్య, చెన్నకృష్ణ, రామిరెడ్డి, వైసిపి జిల్లా విద్యార్థి సంఘ అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్‌ దాస్‌, షేక్‌ రియాజ్‌ భాషా, మహేష్‌రెడ్డి, రఘునాథ పక్కీరారెడ్డి దస్తగిరిరెడ్డి, ప్రేమనాథరెడ్డి, అల్తాఫ్‌, రమణయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు.