ప్రజాశక్తి - చిలకలూరిపేట: యువగళం.. జగన్ పాలనకు మంగళం పాడే యాత్రని, అందుకే తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్‌లో యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తు న్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. పట్టణంలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జగన్ రాక్షస పాలనలో బాధితులే నిందితులవుతున్నారని, వైసిపి గూండాలు దాడి చేసి యువగళం వాలంటీర్లను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. రాళ్లదాడిలో గాయపడిన వాలంటీర్లకు వైద్యం చేయించాల్సింది పోయి పోలీస్ వాహనాల్లో తిప్పడమేంటని ప్రశ్నిం చారు. యువగళం కార్యకర్తలకు ఏమైనా జరిగితే వైసిపి ప్రభుత్వానిదే బాధ్యతని, వారిని సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువ గళం పాదయాత్రను భగం చేసేం దుకు మొదట్నుంచీ సిఎం జగన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. టిడిపి పాలనలో చంద్రబాబు కనుసైగ చేస్తే జగన్ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. పోలీ సులు ఇప్పటికైనా చట్టబద్ధంగా వ్యవహరించాలని, కొన్ని నెలల్లో వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ తథ్యమని అన్నారు.










