Jun 10,2023 20:50

సమావేశంలో మాట్లాడుతున్న తిక్కారెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాయ మాటలు నమ్మి పరిస్థితి లేదని టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. టిడిపి అధిష్టానం ఆదేశాల మేరకు శనివారం స్థానిక హెచ్‌ఆర్‌బి కల్యాణ మండపంలో టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్‌ స్వామి అధ్యక్షతన 'టిడిపి మేనిఫెస్టో భవిష్యత్తుకు గ్యారంటీ' అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పరిపాలనలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రజల కోసం ప్రకటించిన మేనిఫెస్టో జనరంజకంగా ఉందని తెలిపారు. అద్భుతమైన పాలన అందించడానికి మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలందరూ కలిసి టిడిపి జెండా ఎగరవేయడానికి కృషి చేయాలని కోరారు. టిడిపి మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని తెలిపారు. జగన్మోహన్‌ రెడ్డి పని అయిపోయిందని, రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, నియోజకవర్గంలో తిక్కారెడ్డి ఎమ్మెల్యే అవుతారని సోమిశెట్టి వెంకటేశ్వర్లు జోష్యం చెప్పారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్‌ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్‌, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌ రెడ్డి, పెద్దకడబూరు మండల కన్వీనర్‌ బసలదొడ్డి ఈరన్న, కోసిగి మండల కన్వీనర్‌ జ్ఞానేష్‌, బీసీ సీనియర్‌ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, సాతనూరు కోసిగయ్య, కొండగేని వీరారెడ్డి, పంపాపతి, నాడిగేని వీరారెడ్డి, లక్ష్మికాంత్‌, గోపాల్‌, కప్పయ్య, ప్రభాకర్‌ రెడ్డి, క్లస్టర్‌ ఇన్‌ఛార్జీలు వెంకటపతి రాజు, కోట్రేష్‌ గౌడ్‌, ఎల్లారెడ్డి, చావిడి వెంకటేష్‌, భరద్వాజ్‌ శెట్టి, కృష్ణారెడ్డి, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమర్‌ సాబ్‌, గోపాల్‌ స్వామి, అశోక్‌ రెడ్డి, బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్‌నాథ్‌ రెడ్డి, కృష్ణ మోహన్‌ రెడ్డి, చిన్న భూంపల్లి మాజీ సర్పంచి నరసింహులు, పల్లెపాడు మాజీ సర్పంచి చంద్ర, తెలుగు యువత విజయ రామిరెడ్డి, నాడిగేని మహదేవ్‌, పవన్‌ కుమార్‌, వట్టేప్పగారి నరసింహులు, మేకల నరసింహులు, ఎంపిటిసి వెంకటేష్‌, సూగూరు నాగేష్‌, రాగన్న, మాలపల్లి చంద్ర, నరసన్న, ఎస్సీ సెల్‌ నాయకులు విజరు, మారెప్ప, యోబు, ఎంపిటిసి రాజు, దావీదు, రాజా బాబు, బెళగల్‌ సర్పంచి రామయ్య పాల్గొన్నారు.