Dec 19,2022 23:40
బ్యాటింగ్‌ చేసి క్రికెట్‌ పోటీలు ప్రారంభి స్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి

ప్రజాశక్తి-సీతమ్మధార : యువత అన్ని రంగాల్లో రాణించాలని విశాఖ ఎంపీ ఎంవివి. సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కైలాసపురం డిఎల్‌బి గ్రౌండ్‌లో ఈ నెల 19 నుంచి 21వరకు నిర్వహించనున్న జెఎంఆర్‌.కప్‌ క్రికెట్‌ పోటీలను విశాఖ జిల్లా వైసిపి అధ్యక్షులుపంచకర్ల రమేష్‌బాబు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజుతో కలిసి సోమవారం ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. 31జట్లు పాల్గొంటున్న టోర్నీని టాస్‌ వేసి మ్యాచ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కట్టుమూరి సతీష్‌, ఫ్లోర్‌లీడర్‌ బాణల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ అల్లు శంకరరావు, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, సారిపిల్లి గోవింద్‌, బర్కత్‌ఆలీ, కార్పొరేటర్లు కె.అనిల్‌కుమార్‌ రాజు, సాడి పద్మారెడ్డి, ఆళ్ల లీలావతి, ఉషశ్రీ, రెయ్యి వెంకటరమణ, కెవిఎన్‌ శశికళ, కోఆప్షన్‌ సభ్యులు సేనాపతి అప్పారావు, వార్డు ఇంచార్జ్‌ నీలి రవి, సీనియర్‌ నేతలు కిరణ్‌ రాజు, పేడాడ రమణకుమారి, బొడ్డేటి కాశీ విశ్వనాథం పాల్గొన్నారు.
సీతమ్మధార : ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పుట్టినరోజు సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయం ప్రాంగణంలో కెకె రాజు నేతత్వంలో సోమవారం వైసిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలకు ఖోఖో, త్రోబాల్‌, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను టాస్‌ వేసి ప్రారంభించిన రాజు మాట్లాడుతూ సిఎం జగన్‌ పిలుపు మేరకు ఆయన జన్మదినం సందర్భంగాసేవా కార్యక్రమాలతోపాటు ఆటల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డి, ఉషశ్రీ, ఆళ్ళ లీలావతి, కెవిఎన్‌ శశికళ, యాత కార్పొరేషన్‌ చైర్మన్‌ పిల్లి సుజాత, రత్నం, పాల్గొన్నారు.
భీమునిపట్నం : స్థానిక జివిఎంసి మినీ క్రికెట్‌ స్టేడియంలో ఎపి సిఎం, కప్‌ క్రికెట్‌ పోటీలను సోమ వారం వైసిపి నియోజక వర్గ పరిశీలకులు పి బాలరాజుతో కలిసి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నాక,. బ్యాటింగ్‌ చేసి క్రికెట్‌ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జివిఎంసి కోఆప్షన్‌ సభ్యులు కొప్పల ప్రభావతి, పిఎసిఎస్‌ అధ్యక్షులు అక్కరమాని రామునాయుడు పాల్గొన్నారు
ములగాడ: సిఎం జగన్మోహనరెడ్డి పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సింధియా షిప్‌యార్డ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున క్రికెట్‌ పోటీలను వైసిపి జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు ప్రారంభించారు.కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌, జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్‌, జివిఎంసి కోఆప్షన్‌ సభ్యులు బెహరా భాస్కరరావు, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు పివి. సురేష్‌, కార్పొరేటర్లు గుండపు నాగేశ్వరరావు, కొణతాల సుధా, బల్ల లక్ష్మణరావు, వార్డు ఇన్‌ఛార్జిలు పుర్రె సురేష్‌, రేవల్ల సత్యనారాయణ, గులిగిందల కృష్ణ, దొడ్డి కిరణ్‌, ముర్రు నానాజీ, చుక్కా ప్రసాద్‌రెడ్డి, అప్పలస్వామి నాయుడు, పిలకా రామ్మోహన్‌రె నమ్మి శ్రీను, సోమాదుల సురేష్‌ పాల్గొన్నారు.
మహిళలకు ముగ్గుల పోటీలు
ఆరిలోవ: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగాకార్పొరేటర్‌ కెళ్ళ సునీత ఆధ్వర్యంలో ఆరిలోవకాలనీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్ద మహిళలకు ముగ్గులు, మ్యూజికల్‌ చైర్‌, లెమన్‌ స్పూన్స్‌ ఆటల పోటీలు నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ వైసిపి నేత అక్కరమాని వెంకటరావు వార్డు ఇన్‌ఛార్జి కెళ్ల సత్యనారాయణ, సిఒ సూరిబాబు, పిల్లి వీర్రాజు, బేతా దుర్గారావు, వెంకటరెడ్డి, శ్రీను పోలారావు, అప్పలనాయుడు, బాబురావు, బేగం పాల్గొన్నారు.